అనేక రంగుల్లో ప్రవహిస్తున్న అద్భుతమైన నది..

నీటికి రంగు, రుచి ఉండదు అని అంటారు. అయితే ఈ నదిని చూస్తే మాత్రం రుచి సంగతేమో గాని రంగు మాత్రం అద్బుతమనే చెప్పాలి. అది కూడా ఒక రంగులో కాదు రకరకాల రంగులతో ఇంద్ర ధనుస్సును తలపించే విధంగా ఉంటుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో, డాన్నేలోన్ ప్రాంతంలో రెయిన్బో (ఇంద్ర ధనుస్సు) అనే నది రకరకాల రంగులతో ప్రవహిస్తూ, స్వర్గంలో ప్రవహించే నదులు ఇలాగే ఉంటాయా అన్నంత అందంగా ఉంటుంది. దాదాపు 30 కిలోమీటర్ల దూరం ప్రవహించే ఈ నది కింద ఉండే భూమి స్వభావం, నదిలో పెరిగే రకరకాల మొక్కల వల్ల ఇలా రంగుల్లో ప్రవహిస్తుంటుంది.

Leave a Reply