ముగిసిన రాజ్యసభ నామినేషన్ల పర్వం

దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఉన్న రెండు రాజ్యసభ స్థానాలను కుడా అధికార తెరాస ఏకగ్రీవంగానే గెలిచే అవకాశం స్ప్రుష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఖాళి అయిన రెండు స్థానాలకు తెరాస తరపున డీ. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీ కాంతారావులు మాత్రమే నామినేషన్ వేయడంతో ఇక వారి ఎన్నిక లాంఛనప్రాయమే.  ఇక ఎంతో ఉత్కంట రేపిన ఆంధ్రప్రదేశ్ లో కుడా ఎన్నికలు ఏకగ్రీవంగానే జరగబోతున్నాయి. ఇక్కడ ఖాళి అయిన నాలుగు స్థానాల్లో ఒకటి వైకాపా తరపున విజయ సాయి రెడ్డి, తెలుగు దేశం పార్టీ తరపున సుజనా చౌదరి, టిజి వెంకటేష్ బిజెపి తరపున సురేష్ ప్రభులు మాత్రమీ నామినేషన్ దాఖలు చేశారు. మరో అభ్యర్థీని పోటిలో నిలబెట్టడానికి తెదేపా విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ అది కుదరకపోవడంతో ఏకగ్రీవ ఎన్నికలకే మొగ్గు చూపారు.

Leave a Reply