లైఫ్ బ్రాండెడ్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించిన రిలయెన్స్

రిలయన్స్ కంపెనీ అధ్వర్యంలో తాజాగా మార్కెట్లోకి విడుదలైన స్మార్ట్ ఫోన్ సిరీస్ రిలయన్స్ 4జి లైఫ్ కు మొదట్లో స్పందనగా బాగా లభించినా అది కొద్దిరోజులకే తగ్గుముఖం పట్టినట్లుంది అందుకే కంపెనీ ఈ బ్రాండెడ్ ఫోన్ల వరకు ధరలు తగ్గిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.ఈ ప్రకటన ప్రకారం:

  • లైఫ్ వాటర్ 2 రూ.4వేల తగ్గింది..  కొత్త ధర రూ.9,499/-
  • లైఫ్ విండ్ 6 రూ.500 తగ్గింది..     కొత్త ధర రూ.5,999/-
  • లైఫ్ ఫ్లేమ్ 2 రూ. 1,300 తగ్గింది..  కొత్త ధర రూ. 3,499/-

అయితే ఇదే సిరీస్ లో వచ్చిన లైఫ్ ఫ్లేమ్ 4, లైఫ్ ఫ్లేమ్ 5, లైఫ్ ఫ్లేమ్ 6 మొబైల్స్ పై రూ.1000/- తగ్గించగా ప్రస్తుతం మార్కెట్లో ఈ మూడు మొబైల్స్ కేవలం రూ.2999/- కే అందుబాటులోకి వచ్చాయి. ధరల తగ్గింపుతో మార్కెట్లో ఈ సిరీస్ మొబైల్ ఫోన్ల అమ్మకాలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఈ ధరల తగ్గింపుతో పాటు మూడు నెలల ఉచిత 4జి డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యం ఇవ్వనునట్లు తెలిపింది.తొలుత ఈ ఆఫర్ ను రిలయన్స్ ఉద్యోగులకు అందించనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది.

Leave a Reply