తేల్చి చెప్పిన కాగ్..

ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ కు కష్టాలు తప్పేలా లేవు. ఆ విషయాన్ని కాగ్ (comptroller and Audit general of India) స్పష్టం చేసింది. గత కొంత కాలంగా ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థల మధ్య బంగాళాఖాతంలోని సహజ వాయువు నిక్షేపాల విషయమై గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. తమ చమురు క్షేత్రం చుట్టూ 350 మీటర్ల పరిధిలో వలయాకారంగా రిలయన్స్ బావులు తవ్విందని, దాని వల్ల చమురు క్షేత్రాల్లోని సహజ వాయువు రిలయన్స్ బావుల్లోకి వెళ్తుందని ఓఎన్జీసీ ఆరోపించింది. తమకు నష్ట పరిహారం చెల్లించాలని ఓఎన్జీసీ డిమాండ్ చేసింది. దీనిపై విచారించేందుకు ప్రభుత్వం థర్డ్ పార్టీగా డీ గ్యోలర్, మెక్ నాటన్ ( డీ అండ్ ఎం)ని నియమించింది. డీ అండ్ ఎం విచారణ జరిపి ఓఎన్జీసీ చమురు క్షేత్రం నుండి రిలయన్స్ బావుల్లోకి సహజ వాయువు వలస వెళ్ళే అవకాశం ఉందని నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదికను గనుక ప్రభుత్వం ఆమోదిస్తే ఓఎన్జీసీ గెలిచినట్లే. రిలయన్స్ సంస్థ దాదాపు 30 వేల కోట్ల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తుంది.

Leave a Reply