రుద్రమదేవి అరుదైన ఘనత..

అనుష్క, అల్లు అర్జున్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం రుద్రమదేవి. తెలంగాణను పాలించిన కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని గుణశేఖర్ తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన, చరిత్రకారుల నుండి విమర్శలు వచ్చినప్పటికీ మంచి విజయం సాధించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటన ఈ చిత్రాన్ని నిలబెట్టిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు రుద్రమదేవి చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు భారత దేశం తరపున ఈ చిత్రాన్ని పంపించారు. ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో రుద్రమదేవి పోటీ పడనుంది.

rudramadevi recommended for oscar

Leave a Reply