కాశ్మీర్ లో కీలక పరిణామం…

గత నెల రోజులుగా కాశ్మీర్ రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. బుర్హాన్ ఎన్కౌంటర్ తో మొదలైన ఈ ఆందోళనలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఆందోళనలు చేస్తునారంటూ భారత్, భారత్ కాశ్మీర్ పై దౌర్జన్యం చేస్తుందని పాకిస్థాన్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కాశ్మీర్ అల్లర్లు కొత్త మలుపు తీసుకున్నాయి. తొలిసారిగా భారత అంతర్గత భద్రత విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోబోతుంది. ఐక్యరాజ్య సమితికి చెందిన మిలిటరీ గ్రూప్ ఇక పై భారత్, పాకిస్థాన్ కు చెందిన భద్రతా దళాలతో కలిసి కాశ్మీర్ లో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ ప్రతినిధి ఫర్హాన్ హక్ మాట్లాడుతూ హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బుర్హాన్ వాని ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీర్ లో పరిస్థితులు మారిపోయాయి అని, ఇక నుంచైనా అక్కడ శాంతి భద్రతలు సాధారణంగా కొనసాగించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

Leave a Reply