ర్యాలీ నిర్వహించిన రైతులు..

తెలంగాణలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి పక్షాలు అన్ని ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాయి. ప్రతి పక్షాలకు టీ జేఏసీ కూడా మద్దతు తెలిపింది. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలకు ప్రజల నుండి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మొత్తం 8 ముంపు గ్రామాల్లో 6 గ్రామాల ప్రజలు ఇప్పటికే స్వచ్చందంగా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మిగతా రెండు గ్రామాల ప్రజలు కూడా మరో ఒకటి,రెండు రోజుల్లో భూములు ఇచ్చే అవకాశం ఉంది. తాజాగా మల్లన్న సాగర్ ఆపాలంటూ ప్రతి పక్షాలు చేస్తున్న పోరాటానికి ప్రజల నుండి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ప్రతిపక్షాలను పట్టించుకోకుండా రైతులే స్వయంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply