ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందే అవకాశం..!

ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపి కేవీపీ రామచందర్ రావు ప్రైవేటు బిల్లు గత సమావేశాల్లో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు సమయం అనుకూలించకపోవటం వల్ల బిల్లు చర్చకు రాలేదు. కాని ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓటింగ్ కుడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తన మద్దతును ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది అలాగే తమ వంతుగా దేశంలోని మిగిలిన పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యెక హోదా కోసం తీవ్రంగా పట్టు బట్టింది. ఇప్పుడు ఆ పార్టీకి బిల్లుకు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది. అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా బిల్లు ఆమోదం కోసం ఉన్న అడ్డంకులన్నీ తొలగి పోయినట్లే. వచ్చే శుక్రవారం ప్రత్యేక హోదా బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Leave a Reply