స్పీకర్ కు నోటిసులు జారీ చేసిన సుప్రీం కోర్టు..

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా రాజకీయ వలసలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ మారకుండానే అధికార పార్టీలో చేరడం జరిగింది. ఆయా రాజకీయ పార్టీలు స్పీకర్ కు పిర్యాదు చేసిన ఫలితం శూన్యం. దాంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం కోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, శాసన సభా స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జరీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ మరియు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్పందన ఏమిటో వేచి చూడాలి.

Leave a Reply