జూలై 25లోగా కేంద్రం నివేదిక ఇవ్వాలని కోరిన సుప్రీమ్ కోర్టు

సుప్రీమ్ కోర్టు బహుళ జాతి అంతర్జాల సంస్థలైన గూగుల్ మరియు యాహూ లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ సెర్చ్ రిజల్ట్స్, మరియు ఇంటర్నెట్ సమాచారం సంబంధించిన విషయ సమీకరణలో సెక్స్ సెలక్షన్, అబార్షన్ సంబంధిత ప్రకటనలు ఇవ్వకూడదు అనే నిబంధనను ఇప్పటికే చాలా సార్లు ఉల్లంఘించారు అని అటువంటి ప్రకటనలు చేయడం భారత్ లో చట్టరీత్యా నేరం అని ఎందుకు నిబంధనలు పాటించడంలేదని ప్రశ్నించింది.అయితే తాము ఎటువంటి ఉల్లంఘనలు చేయలేదని అటువంటి ప్రకటనలు చేయలేదని ఆయా సంస్థల తరపున వాదించిన లాయర్ చెప్పారు. అయితే ఈ విషయం పై కేంద్రం ఈ నెల 25లోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది.

Leave a Reply