చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ స్పందించాలి..

ప్రస్తుతం టాలీవుడ్ లో అందరు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య జరిగిన గొడవల గురుంచే మాట్లాడుకుంటున్నారు. అభిమానుల మధ జరిగిన గొడవల్లో పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, ఒకప్పుడు తమ అభిమాన హీరో సినిమా హిట్టయితే పండగ చేసుకునే అభిమానులు, ఇప్పుడు వేరే హీరో సినిమా ఫ్లాప్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఇదెక్కడి సంస్కృతి అని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ స్పందించాలని ఆయన కోరారు. ప్రస్తుత తరం ఉన్న హీరోలంతా బాగా చదువుకున్న వారని, కాని వారు ఒకరు చెబితే వినే పరిస్థితుల్లో లేరని తెలిపారు.అప్పటి హీరోలు తాను, దాసరి నారాయణ రావు లాంటి సీనియర్ వ్యక్తులు చెబితే వినే వారని, ఇప్పుడున్న హీరోలు అందరు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారని విమర్శించారు.

Leave a Reply