దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా అడుగు పెట్టండి..

తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మద్దతున విపక్షాల ఆధ్వర్యలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి భూ నిర్వాసితులపై పోలీసులతో కొట్టించడం అన్యాయమని తాము ప్రజలకు మద్దతుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని, మరి తాగి ఓకే వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తూ, తాగి ఆదేశాలిస్తే పోలీసులు ప్రజలపై వీరంగం సృష్టించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బంద్ విఫలం అయ్యిందని మంత్రి హరీష్ రావు అంటున్నారని, బంద్ అంటే తెరాస కార్యాలయాన్ని ధ్వంసం చేయాలా? అలా చేస్తేనే బంద్ కనిపిస్తుందా? ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటే హరీష్ రావుకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. హరీష్ రావుకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఏటిగడ్డలో అడుగు పెట్టగాలారా అని సవాల్ విసిరారు. ప్రజల తరపున టీడీపీ, బీజేపీలు మిగతా ప్రతిపక్షాలతో కలిసి పోరాదతాయని, మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

Leave a Reply