ఎపి సిఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన తెలంగాణ సిఎం కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కోర్ట్ కి వెళ్ళాలి అన్న చంద్రబాబు వాఖ్యలపై కెసిఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు అన్ని నిభందనలకు అనుగుణంగానే కడుతున్నవి  వాటి జోలికి వస్తే వురుకోనేది లేదని పేర్కొన్నారు. తెలంగాణ నిద్రలోంచి లేచిన బెబ్బులి అని, అనవసరంగా తమతో పెట్టుకోవద్దు అని హెచ్చరించారు. మీరు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతామని కెసిఆర్ వాఖ్యానించారు. కెసిఆర్ చేసిన వాఖ్యలపై ఇప్పటి వరకు ఆంధ్ర నాయకులు ఎవరు ప్రతిస్పందించకపోవడం గమనార్హం.

Leave a Reply