దూకుడు పెంచిన తెరాస అధినేత..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 14 సంవత్సరాలు అలుపెరుగని ఉద్యమం చేసి తెలంగాణను సాధించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెరాస మెజారిటీ స్థానాలు సాధించడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టారు. పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత కేసీఆర్ లో ఉద్యమ కాలం నాటి దూకుడును పూర్తిగా తగ్గించి పూర్తిగా పరిపాలనపై దృష్టి సారించారు. ప్రతి పక్షాలు ఎంతగా ఆయనను రెచ్చగోట్టాలని చూసిన ఆయన తన చేతలతోనే సమాధానం ఇచ్చారు. అయితే మహారాష్ట్రతో చారిత్రిక నీటి ఒప్పందం కుదుర్చుకొని వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక్క సారిగా తనలోని ఉద్యమకారుడిని నిద్రలేపారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. గత రెండు సంవత్సరాలుగా ఎన్నడూ చూపించని దూకుడును చూపించారు. ఏకంగా ప్రతి పక్షాలు తమ ఆరోపణలను నిరుపించకపోతే ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేయడం ద్వారా తాను ఎంతగా తెగించాలనుకున్నారో కేసీఆర్ తెలియజేశారు.

Leave a Reply