ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో కూడా..

అంతర్ రాష్ట్ర మండలి సమావేశం కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మోడీతో రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలను చర్చించారు. రాష్ట్ర విభజన వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయి అని, వాటిలో చాల వరకు అపరిష్కృతంగానే ఉన్నాయి అని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. అలాగే హై కోర్ట్ విభజనను కూడా పూర్తి చేయాలని కోరారు.ప్రధానితో భేటి అనంతరం కేసీఆర్ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన నిధుల గురుంచి ఆయనతో కేసీఆర్ చర్చించారు. రాష్ట్రానికి రావలసిన నిధులను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని ఆర్ధిక మంత్రిని కేసీఆర్ కోరారు.

Leave a Reply