టిఆర్ఎస్ గుర్తు కారు కాకుండా బస్సు లేదా రైలు అయితే బాగుండేమో..!

తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం సృష్టించిన వలసల తాకిడినుండి ఇంకా బయటపడినట్లు లేదు. అధికారపార్టీలోకి చేరుతున్న ఎమ్మెల్యేలు అంతా అభివృద్ధి కోసమే అంటున్నా అందులో కాసులు, కాంట్రాక్టులు కీలకం అని అందుకే పార్టీ ఫిరాయించారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యాఖ్యానించారు.తెలంగాణ పార్టీ గుర్తు కారు కాకుండా బస్సు లేదంటే రైలు అయితే బాగుంటుందని అప్పడు డబ్బులు ఉన్న ప్రతి నాయకుడిని ఎక్కిన్చుకోవచ్చని సెటైర్లు గాంధీ భవన్ గోడల మధ్య బాగానే వినిపిస్తున్నాయి. అయితే అప్పుడు వైఎస్ చేసిందేంటి? అది సంసారం. మేము చేస్తే వ్యభిచారమా? అని ఘాటుగా ప్రశ్నించారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్. మేము ఆహ్వానించలేదని పాలన చూసి వారే వస్తున్నరాని ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఈ మాటలు తూటాలు పేల్చినట్లుగా తయారైంది పరిస్తితి. గతంలో తెలుగు దేశం పార్టీ క్యాడర్ తీరుగానే ఇప్పుడు కాంగ్రెస్ కూడా  మరింత బలహీన పడుతుంది.

 

 

Leave a Reply