టీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్..

తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ను ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రెజంటేషన్ ఇస్తామని అప్పట్లో పేర్కొంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రెజంటేషన్ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నట్లు కోటి ఎకరాలకు సాగునీరు అంశంపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ హయాంలోనే కోటి ఎకరాలకు సాగు నీరు ప్రణాళికలు సిద్దం అయ్యాయి అని, దానికి తగ్గట్లుగానే ప్రాజెక్టులు ప్రారంభించామని, ఇప్పుడు  అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ తాము ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా రీడిజైనింగ్ అంటూ నాటకాలు ఆడుతున్నారు అని ఆరోపించారు. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను కమీషన్ల కోసమే మొదలుపెట్టారని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దం అయ్యింది.

Leave a Reply