అంగరంగ వైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.సంజీవయ్య పార్కులో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొని అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభ ఆవరణలో జరిగిన వేడుకల్లో స్పీకర్ మధుసూదన్ రావు, శాసనమండలి ఆవరణలో జరిగిన వేడులల్లో మండలి చైర్మన్ స్వామి గౌడ్, తెలంగాణ భవన్ లో హోం మంత్రి నాయిని నరసింహా రావు పతాకావిష్కరణ గావించారు. అన్ని జిల్లాలో కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, మండల పరిషత్తు కార్యాలయాల్లో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాల్లో, మార్కెట్ కమీటీ కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు,కళాశాలలో పతాకావిష్కరణ గావించారు.రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెలంగాణ  సంబరాలతో కళకళడుతున్నాయి.

Leave a Reply