ఘనంగా జరగబోతున్న తెలంగాణ అవతరణ వేడుకలు

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ సంబురాలు – 2016 పేరిట అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అందుకోసం జిల్లాకు 30 లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకం ఆవిష్కరిస్తారు. అన్ని కార్పొరేషన్లు,మున్సిపాలిటీలు,నగర పంచాయతీలు,గ్రామా పంచాయితీలు సర్వాంగ సుందరంగా ముస్తాబు అవబోతున్నాయి. అలాగే మున్సిపాలిటీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టారు.ప్రతి గ్రామంలో జరిగిన అవతరణ వేడుకలకు సంబంధించిన ఫోటోలను క్షేత్ర స్థాయి సిబ్బంది సేకరించి అప్ లోడ్ చేయాలని రాష్ట్ర పంచాయత్ రాజ్ , గ్రామినాభివ్రుద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply