ముంపు బాధితులకు న్యాయం చేయాలి..

టీ.జేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై మండి పడ్డారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పై నేడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం అసలు మల్లన్న సాగర్ డ్యాం అవసరమే లేదని నిపుణులు చెబుతున్నారు అని అన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సాదా బైనామా పేరుతో ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తుందని తెలిపారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పై ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తున్నాడని, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోదండరాం సూచించారు. ముంపు భాదితులకు న్యాయం చేయాలని, న్యాయం చేసే వరకు తాము పోరాడతామని కోదండరాం తెలిపారు. తాము ఏ రాజకీయ పార్టీ తరపున మాట్లాడటం లేదని, ప్రజల తరపున మాత్రమే పోరాటం చేస్తున్నామని కోదండరాం అభిప్రాయపడ్డారు.

Leave a Reply