ఇస్రోతో తెలంగాణ జలవనరుల శాఖ ఒప్పందం..

తెలంగాణలో మరొక చారిత్రాత్మక  ఘట్టం చోటుచేసుకుంది. తెలంగాణ జలవనరుల శాఖ ఇస్రోతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ఇక నుండి తెలంగాణ జావనరుల శాఖ అత్యాధునిక టెక్నాలజీతో ఉండనుంది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఇస్రో ప్రతినిధులతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఇకపై తెలంగాణలో జలాశయాల్లో,కుంటల్లో,చెరువుల్లో నీటినిల్వలను ఉపగ్రహాల సహాయంతో వీక్షిస్తారు. ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మారుస్తామని ప్రకటించారు. జల వనరుల శాఖ మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా పని చేసేందుకు టెక్నాలజీ ఎంతో అవసరమని అందుకోసం ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హరీష్ రావు వెల్లడించారు. ఉపగ్రహాల సహకారంతో జలవనరుల సమాచారం తెలుసుకోవడం ద్వారా రాష్ట్రంలోని నీటి వనరులపై స్పష్టమైన అవగాహనకు వచ్చే అవకాశం ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక నుండి అమలులోకి వచ్చే సాంకేతిక విధానం గూగుల్ కంటే వేగంగా పనిచేస్తుందని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి పనిచేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, ప్రాజెక్టుల కోసం గూగుల్ మ్యాప్ ఉపయోగించుకున్న ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు.

Leave a Reply