రైతుల ఆత్మహత్యలు లేని జిల్లా కావాలంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టాల్సిందే

ఇన్నాళ్ల రైతుల బాధలు తీరాలన్నా, రైతుల ఆత్మహత్యలు లేని జిల్లా కావాలంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి తన్నేరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లాలో పర్యటించిన ఆయన ముంపు గ్రామాల ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని అన్నారు. ఈ విషయంపై అనవసర రాద్దాంతం చేస్తున్న కాంగ్రెస్స్ గతంలో ఎన్నో గ్రామాలు ముంచి ఒక్క ఎకరాకు సాగునీరివ్వలేదని ఆయన విమర్శించారు.అయితే ఈ విషయంపై అనవసరంగా ప్రజలను మోసం చేస్తూ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ , టిడిపి లు ప్రయత్నిస్తున్నారు అని అన్నారు.

Leave a Reply