తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తీసుకువస్తా – కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అరుదైన గౌరవం అందుకోబోతున్నారు. వచ్చే నెల 11,12 తేదిలలో శ్రీలంకలో నిర్వహించే హ్యూమన్ క్యాపిటల్ సమ్మిట్ లో శ్రీలంక ప్రధాని విక్రమ సింఘేతో కలిసి కేటీఆర్ కీలక ఉపన్యాసం చేయనున్నారు. దేశ విధానాలు, ఉద్యోగాలకు యువత సంసిద్దత, శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే అనేక దేశాలలో పర్యటించిన కేటీఆర్, తన ప్రసంగాలతో వాగ్దాటితో ఎన్నో పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చారు. ఇప్పుడు దేశ విదేశ ప్రతినిధులు, కార్పొరేట్ అధిపతులు ఎందరో పాల్గొనే ఈ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించనుండడం వల్ల తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను తీసుకువచ్చే అవకాశం ఉంది.దీనిపై స్పందించిన కేటీఆర్, శ్రీలంక ప్రభుత్వం నుండి ఆహ్వానం అందడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శిక్షణ కార్యక్రమాలను, యువతలో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను శ్రీలంకలో జరిగే సమావేశంలో వివరిస్తానని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Reply