హై కోర్టు విభజనపై తెలంగాణ న్యాయవాదులు..

హై కోర్టు విభజనపై తెలంగాణ న్యాయవాదులు ధర్నాకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ ఎంపీలతో కలిసి ధర్నా చేశారు తెలంగాణలోని 10 జిల్లాలకు చెందిన న్యాయవాదులు భారీగా తరలివచ్చి దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ ఆటపాటలు, ధూం ధాంలతో న్యాయ వ్యవస్థలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వినిపించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్ట్ తోనే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.తెలంగాణ న్యాయాధికారులపై,న్యాయముర్తులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం విభజనపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా చేతులకు సంకెళ్ళు వేసుకొని నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మాదిరిగా మరో పోరాటం చేసి ప్రత్యేక హై కోర్ట్ ను సాధించుకుంటామని న్యాయవాదులు తెలిపారు. ఆంద్ర న్యాయమూర్తులు తెలంగాణను వదిలి వెళ్ళాలని, లేకపోతే వెళ్ళగోడతామని హెచ్చరించారు.

Leave a Reply