జిల్లాల ఏర్పాటుపై ఏర్పడ్డ సందిగ్ధత…

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేస్తామని ప్రకటించారు. గతంలో ఆయన జూన్ 2 నాడు కొత్త జిల్లాలను ప్రకటించి, దసరా నాటి నుండి పరిపాలనలోకి తీసుకు వస్తామని ప్రకటించారు. తర్వాత ఆగష్టు 15 నాడు ప్రకటించి దసరా నుండి పరిపాలన కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే ఆగష్టు 15న కూడా జిల్లాల ప్రకటన సాధ్యం కాదని అధికారులు తెలియజేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. మరో వైపు అనేక ప్రాంతాల నుండి, ప్రజల నుండి అనేక కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. అవే కాకుండా ప్రభుత్వం ప్రస్తుతం మల్లన్న సాగర్, ఎంసెట్ లీకవ్వడం వంటి అనేక సమస్యలతో సతమతం అవుతున్నది. వాటన్నింటిని పరిష్కరించకుండా ప్రభుత్వం జిల్లాల విభజనను చేపట్టదు అని అధికార వర్గాలు అంతర్గతంగా పేర్కొంటున్నట్లు సమాచారం. అన్ని అనుకూలిస్తే కనీసం దసరా నాటికైనా జిల్లాల ప్రకటన చెయ్యాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply