డిమాండ్ చేస్తున్న తెలంగాణ నేతలు..

ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనేక రాష్ట్రాలు ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తూనే తమకు ప్రత్యేక హోదా కావాలంటున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి తెలంగాణ రాష్ట్రం కూడా చేరింది. తెలంగాణ నేత మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,  ఆంధ్రప్రదేశ్ లో 35 లక్షల విలువైన సముద్ర తీరం ఉందని, ప్రపంచంలోనే అత్యధిక పారిశ్రామిక వేత్తలు ఉన్న రాష్ట్రం పేర్కొన్నారు. అన్ని వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే 60 సంవత్సరాలుగా వలస పాలకుల చేతిలో దగా పడ్డ తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలుగుదేశం పార్టీ నేత లోకేష్ చేసిన వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశ వ్యాప్తంగా మన్ననలను పొందుతున్నాయి అని, తెలుగు దేశం పార్టీ నేతలు ఎంత ప్రయత్నించినా తెలంగాణలో టీడీపీని బ్రతికించలేరని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Leave a Reply