ఇక టిడిపి కథ కూడా ముగిసినట్ట్లేనా?

తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస తన ఆపరేషన్ ఆకర్ష్ ని ఒక జైత్రయాత్రలాగా కోనసాగిస్తుంది. ఇప్పటికే బిఎస్పి తెలంగాణ శాఖను, వైఎసార్సిపి తెలంగాణ శాఖను తెరాసలో విలీనం చేశారు. ఇక టిడిపి శాసనసభా పక్షాన్ని విలీనం చేసినప్పటికీ ఇంకో ముగ్గురు ఎమెల్యేలు మిగిలిపోయారు. వారిలో ఎల్బి నగర్ శాసన సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఎప్పట్నుంచో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయన టిడిపి నేతగా కన్నా, బిసి ఉద్యమ నేతగా ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. కోడంగల్ ఎమెల్యే ఓటుకు నోటు కేసులో బాగా ఇరుక్కున్నారు. ఆయనపై ఎప్పుడైనా వేటు పడే అవకాశం ఉంది. మిగిలిన ఖమ్మం జిల్లా ఎమెల్యే సండ్ర వెంకట వీరయ్య తెరాసలోకి రావడానికి సిద్ధంగా ఉన్నా ఆయనపై కూడా ఓటుకు నోటు కేసులో అభియోగాలు రావడంతో కొంత కాలం వేచి చూద్దామని తెరాస వర్గాలు భావించాయి. ఐతే ఇప్పుడు జరుగుతున్న పాలేరు ఉప ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో సండ్రను చేర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని తెరాస అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.అదే జరిగితే ఇప్పటికే తెలంగాణలో వెంటిలేటర్ పై ఉన్న తెలుగు దేశం పార్టీ కోమాలోకి వెళ్ళిపోవడం ఖాయం.

Leave a Reply