40 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు..

మహారాష్ట్ర – తెలంగాణ రాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ముంబైలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, ఫడ్నవిస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనతరం మాట్లాడిన కేసీఆర్ ఒప్పందం ద్వారా తెలంగాణకు జరిగే లాభాన్ని వివరించారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం లభిస్తుందని తెలిపారు. గోదావరిపై మేదిగడ్డ బ్యారేజీ నిర్మిస్తామని, 100 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టంతో 16.17 టీఎంసీ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మెదక్,నిజామాబాద్,వరంగల్,రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 18 లక్షల ఎకరాలకు నీరిస్తామని కేసీఆర్ తెలిపారు. అలాగే ప్రాణహిత నదిపై తమ్మిడి హెట్టి ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తుతో, 1.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, చెన్నూర్ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీరిస్తామని తెలిపారు. అదే విధంగా పెన్ – గంగా నదిపై చనకా – కొరటా బ్యారేజీ నిర్మిస్తామని, దీని పూర్తి స్థాయి నీటిమట్టం 213 మీటర్ల ఎత్తు, 0.85 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని థాంసీ, జైనథ్, బేలా మండలాల్లోని 50 వేల ఎకరాలకు నీరు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు

Leave a Reply