ఆందోళనలో నాగపూర్ నగర ప్రజలు..

మహారాష్ట్రలోని నాగపూర్ నగర వాసులు వింత ప్రకటన ఇచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఒక పులిని పట్టించిన వారికి 50 వేల రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్రేడ్ కర్హండ్లా అభయారణ్యంలో తిరుగాడే జయ్ అనే పులి నాగపూర్ ఎప్పుడు నాగపూర్ పరిసర ప్రాంతాల్లోనే తిరుగాడేది. కాని ఎప్పుడు ఎవ్వరికి హాని చేయలేదు.దాంతో నగర ప్రజలు జయ్ పై అనుబంధాన్ని పెంపొందించుకున్నారు. అయితే దాదాపు వంద రోజుల నుండి ఆ పులి కనిపించకుండా పొయింది. దాంతో ఆందోళన చెందిన నగర ప్రజలు బృందాలుగా విడిపోయి పులిని వెతికే పనిలో పడ్డారు. 15 స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో 100 బృందాలుగా ఏర్పడి నగర ప్రజలు పులి కోసం గాలిస్తున్నారు. ఇప్పుడు తాజాగా పులిని పట్టించిన వారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని ప్రకటించడం గమనార్హం. ఎంతో రాజసంగా ఉండే ఆ పులికి షోలే చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్ర పేరైన జయ్ పెట్టడం గమనార్హం.

Leave a Reply