ఎపి ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన ఎంపి కవిత

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచి అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది.గత ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అధికారంలోకి రాగానే హామీని అమలు చేయడం సాధ్యమయ్యేలా లేదని అందుకు అన్ని రాష్ట్రాల మద్దతు కావాలని కేంద్ర మంత్రులు రోజుకొక మాట చెప్తూ రెండేళ్ళు గడిపారు.మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కెవిపి ప్రైవేటు బిల్ పెట్టినా లాభం లేకుండా పోయింది.అయితే ఇప్పడు తెరాస ఎంపి కవిత ప్రత్యేక హోదాకు తాము మద్దతు తెలుపుతామని ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఒక ప్రైవేటు ఫంక్షన్ కి హాజరైన కవిత అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు తాము మద్దతిస్తామని తెలిపారు.అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Leave a Reply