పారదర్శకంగా ఎంపికలు – ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్ లో నిర్వహించాలనుకున్న గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పుడు ఉన్న 439 ఖాళీలతో పాటు కొత్తగా మరో 597 ఖాళీలు కలిపి మొత్తం 1036 ఖాళీలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటి అయ్యారు. ఎంపిక విధానం నిబంధనలకు అనుగుణంగా జరగాలని, పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని అనుకున్నట్లు జరిగితే నేడు నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. కాగా గతంలో 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు మరో రెండున్నర లక్షల మంది అదనంగా దరఖాస్తు చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

Leave a Reply