పని చేయని వాళ్ళకు మొదటి ర్యాంకా..?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనీతీరుపై రహస్యంగా సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 13వ స్థానంలో నిలిచారు. అయితే ఈ సర్వేపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సచివాలయానికే రాని కేసీఆర్ కు మొదటి ర్యాంకు ఎలా ఇచ్చారో ఇచ్చిన వారే సమాధానం చెప్పాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పనిచేసే వాళ్ళకు కాకుండా, పడుకునే వారికి మొదటి ర్యాంకు ఎలా ఇచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ కు తోక పార్టీలాగా, అనుబంధ సంస్థగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని నాయకుడు ఒకరు తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుంది అంటే, మరొకరు రాష్ట్రంలో పాలన అద్భుతంగా ఉంది అనడం హాస్యాస్పదం అన్నారు.

Leave a Reply