యాంకర్ కు సరైన సమాధానంతో పాటు కౌంటర్ కూడా..!!!

హాస్య నటుడి నుండి కథానాయకుడిగా మారిన సునీల్ తాజాగా నటించిన చిత్రం ‘జక్కన్న’. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా సినిమా విడుదల అయిన తర్వాత కూడా పలు మీడియా ఛానల్ లకు సునీల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఓకే ప్రముఖ ఛానల్ నిర్వహించిన ‘ముఖా ముఖి’లో పాల్గొన్నారు. అందులో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పిన సునీల్, చివర్లో యాంకర్ అడిగిన ప్రశ్నకు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా చంపేస్తా అంటూ యాంకర్ కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సునీల్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురవ్వడంతో అక్కడున్న యాంకర్ తో సహా టీవీ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.

Leave a Reply