మంత్రి పదవికి ఎసరు..

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు, ప్రధాని మోడీ దగ్గర ఎంతో పలుకుబడి ఉంది. అందుకు కారణం అయన నిజాయితీతిగా పనిచేస్తారు, ఎటువంటి అవినీతికి పాల్పడరు అనే పేరు ఉండటమే. అయితే ఇప్పుడు ఆయనపై మోడికి నమ్మకం పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. మోడీ తన మంత్రి వర్గ సహచరులపై చేయించిన సర్వేలలో వెంకయ్యనాయుడు ఆస్తి చాల పెరిగినట్లు తెలిసింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి వెంకయ్య కుమారుడు అడ్డగోలుగా ఆస్థి సంపాదించినట్లు, దాదాపు 40 కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్లు మోడికి నివేదిక చేరినట్లు సమాచారం. అలాగే వెంకయ్య కూతురు నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ లో కూడా ఆక్రమాలు జరిగినట్లు సమాచారం మోడికి చేరింది. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మొహం చూపించ లేక పోతున్న వెంకయ్య ఈ అవినీతి ఆరోపణలతో మంత్రి పదవి కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది.

Leave a Reply