ప్రశంసించిన కేంద్ర జల వనరుల శాఖ మంత్రి..

అంతర్ రాష్ట్ర మండలి సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , సమావేశం అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో, తర్వాత ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం అయిన కేసీఆర్, సాయంత్రం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతితో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయమై ఉమాభారతితో చర్చించారు. కృష్ణా వాటర్ బోర్డు అంశంపై తెలంగాణ అభ్యంతరాలను పరిశీలించేందుకు కృషి చేస్తున్నామని ఉమాభారతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం అద్భుతం అని కేసీఆర్ ను ఉమా భారతి ప్రశంసించారు. మిషన్ కాకతీయ పథకాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు వస్తానని ఉమా భారతి పేర్కొన్నారు. కేసీఆర్ వెంట తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎంపిలు,ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

Leave a Reply