చిరంజీవి 150వ చిత్రంలో విజయశాంతి?

చిరంజీవి 150 వ చిత్రం గురించి రోజుకొక సరికొత్త విషయం బయటికొస్తుంది. చిరంజీవి చాలా ఏళ్ల తరవాత కెమెరా ముందుకు వచ్చి తన 150వ సినిమా తో మళ్ళీ తెలుగు సినిమా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు తమిళంలో మంచి కథాంశంతో వచ్చిన కత్తి సినిమా రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కత్తిలాంటోడు అనే టైటిల్ ని దాదాపు ఖాయం చేసారు. ఈ సినిమా సెట్స్ మీద ఉంది.అయితే ఈ సినిమాకి హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఎంచుకోలేదు. అయితే తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే అప్పట్లో చిరంజీవి సినిమాల్లో దాదాపు ఎక్కువ సినిమాల్లో చిరు కి జతగా నటించిన విజయశాంతి ఇప్పుడు చిరంజీవి 150వ చిత్రంలో నటిస్తోందనే వార్త గుప్పుమంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఈ వార్త నిజం అయితే బాగుంటుందని ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని చిత్రాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ యంగ్ జెనరేషన్ నటులతో పోటీగా  విజయశాంతి చేస్తుందనే వార్త కాస్త ఆశ్చర్యానికి గురి చేయడంలో ఏమాత్రం సందేహం లేదు.

Leave a Reply