నిలిచిపోయిన వెబ్ సైట్..!

ప్రపంచంలోనే అన్ని సినిమా ఇండస్ట్రీలకు నిద్ర లేకుండా చేసిన కికాస్ వెబ్ సైట్ అధినేత ఎట్టకేలకు దొరికిపోయారు. ఉక్రెయిన్ దేశానికి చెందిన ఆర్టిమ్ వౌలిన్ ను బుధవారం పోలాండ్ దేశంలో అరెస్ట్ చేశారు. 28 భాషలకు చెందిన కొన్ని కోట్ల సినిమాలను పైరసీ చేశాడని ఇతడిపై అభియోగాలు ఉన్నాయి. ఇతను కికాస్ కు అనుబంధంగా అనేక ఇతర వెబ్ సైట్ లను సృష్టించి వాటి ద్వారా కూడా పైరసీ సినిమాలను అప్ లోడ్ చేసే వారు. కికాస్ సైట్ విలువ 363కోట్లని పోలీసులు తెలిపారు. దీని వ్యాపార ప్రకటనల ఆదాయం దాదాపు 22 మిలియన్ల డాలర్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.మరోవైపు వౌలిన్ పైమనీ లాండరింగ్, 1 మిలియన్ డాలర్లు విలువ చేసే కాపీ రైట్లు విలువ చేసే మెటీరియల్ ను పైరసీ చేశాడని కేసులు అమెరికాలో ఉన్నందువల్ల తమకు అప్పగించాలని అమెరికా పోలీసులు కోరుతున్నారు.

Leave a Reply