హైకోర్టులో పిటిషన్ వేయడం వల్ల ఎవరికి నష్టం?

తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ మధ్య వార్తల్లో కనపడటం లేదు. తాను కనపడక పోతే జనాలు మర్చిపోతారు అనుకున్నాడో ఏమో కాని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై కేసు వేసి మళ్ళి వార్తల్లోకి వచ్చాడు. తెలంగాణలో తీవ్ర నీటి కొరత ఉందని దాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హైకోర్టులో కేసు వేశాడు. అయితే ఇక్కడ రేవంత్ ఒక విషయం మర్చిపోయినట్లున్నాడు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నీటి కష్టాలు రావడానికి కారణం గత పాలకులు. అది వదిలేసి ఇప్పటి ప్రభుత్వం పై కేసు పెట్టడం ఎంత వరకు సబబో ఆయనే ఆలోచించుకోవాలి. పైగా ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు , మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో నీటి కొరతను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటే టిడిపి అధినేత చంద్రబాబు అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబును ప్రశ్నించకుండా, ప్రభుత్వానికి సహకరించాల్సిన ఈ సమయంలో ఆంధ్రకు తొత్తుగ వ్యవహరిస్తే ఆయనకే నష్టం.

Leave a Reply