వైఫై సేవలతో మరింత పెరగనున్న రద్దీ

నేటి ఇంటర్నెట్ ప్రపంచంలో అన్నం లేకపోయినా నీళ్ళు లేకపోయినా బాధపదేవరికంటే ఇంటర్నెట్, వైఫై లేకపోతే బాధపడేవాళ్ళు చాలా ఎక్కువమందే తయారయ్యారు. అందుకే కొన్ని సంస్థలు ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసుకోడానికి ఉచితంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ లలో వైఫై సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఆ సేవ ఆధ్యాత్మిక కేంద్రాలకు పాకినట్టుంది. అందుకే ఇప్పుడు భారతదేశంలోని ప్రసిద్ద దేవాలయాల్లో ఒకటైన స్వర్ణ దేవాలయం (గోల్డెన్ టెంపుల్ ) అమృత్ సర్ లో ఇకనుంచి ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తేనున్నట్లు అధికారక సమాచారం విడుదల చేసారు ఆలయ అధికారులు.ఈ ఉచిత వైఫై సేవలను వీడియోకాన్ సంస్థ అందించనుందట. అయితే ఉచిత వైఫై వల్ల రద్దీ ఎక్కువగా ఉన్నా భక్తులు, ఇతర భద్రత కి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ సేవలు అందిస్తున్నట్లు వీడియోకాన్ సంస్థ తెలిపింది. అంటే ఇకపై ఆలయాలు మరింత రద్దీగా మారతాయేమో..!!!

Leave a Reply