అక్కడి యువకులు పుస్తకాల స్థానంలో రాళ్ళు పట్టుకుంటున్నారు…

క్విట్ ఇండియా 75వ వార్షికోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ స్వంత గ్రామమైన మధ్య ప్రదేశ్ లోని భాభ్రా గ్రామంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన మోడీ తమ ప్రభుత్వం 1000 రోజుల్లో 18 వేల గ్రామాలకు కరెంటు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాశ్మీర్ ప్రభుత్వం లడఖ్ నుండి సౌర విద్యుత్ ప్రచారోద్యమాన్ని ప్రారంభించడం అభినందనీయం అని మోడీ తెలిపారు. కాశ్మీర్ లో 75 రోజులుగా అల్లర్లు చెలరేగుతున్నాయి అని, క్రికెట్ బ్యాట్లు, పుస్తకాలు పట్టాల్సిన యువకుల చేతిలోకి రాళ్ళు ఇస్తున్నారు అని విమర్శించారు. మెహబూబా ప్రభుత్వం కేంద్రంతో కలిసి అభివృద్ధి కోసం పని చేస్తున్నారని, ప్రతి భారతీయుడికి ఉన్న స్వేచ్చే కాశ్మీర్ ప్రజలకు కూడా ఉందని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. మిగతా భారతీయులకు కాశ్మీర్ అంటే భూతల స్వర్గం అని, అక్కడ ప్రతి సాధారణ పౌరుడు శాంతిని కోరుకుంటున్నారని, అటువంటి కాశ్మీర్ ను రణరంగంగా మార్చవద్దని మోడీ విజ్ఞప్తి చేశారు. కాగా చంద్రశేఖర్ ఆజాద్ స్వంత గ్రామంలో పర్యటించిన తొలి ప్రధాని మోడీయే కావడం గమనార్హం.

Leave a Reply