జగన్ చేతికి దొరికిన సరైన అస్త్రం

గత కొన్ని రోజులుగా ఎమెల్యేల వలసలతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిన వైఎసార్సిపి అధినేత జగన్ ఇప్పుడు పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబును కార్నర్ చేసినట్లే కనపడుతున్నాడు. 2014 లో మోడీ, చంద్రబాబులు ప్రమాణస్వీకారం చేయక ముందు నుండే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్, ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని తెల్చేయడంతో మరింత గట్టిగా పోరాడే అవకాశం కలిగింది. ఇప్పటికే వైసిపి నేతలు ప్రత్యేక హోదాకోసం ప్రభుత్వంతో కలిసి నడుస్తాం అని ప్రకటించడంతో అధికార టిడిపి ఇరుకునపడ్డది. ప్రతిపక్షం కలిసి రావడం లేదు అని ప్రచారం చేద్దాము అనుకున్న టిడిపికి ఎదురు దెబ్బ తగిలింది. అలాగే తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా జగన్ ముందుగా స్పందించడంతో చంద్రబాబుకు క్యాబినెట్ మీటింగ్లో తప్పక తీర్మానం కలిగించే పరిస్థితి కలిగించాడు. ఈ విధంగా జగన్ ప్రజల పక్షాన పోరాడుతూ వారి అభిమానాన్ని చూరగొంటున్నాడు. ఇప్పటికే మే 10 నుంచి కలెక్టరేట్ల ముట్టడి చేసి ధర్నా చేయాలంటే యోచనలో ఉన్న జగన్ ప్రత్యేక హోదాకోసం శ్రమిస్తే ఒకవేళ కేంద్రం అంగీకరిస్తే 2019లో తప్పకుండా జగన్ ని ప్రజలు ఎన్నుకునే అవకాశం ఉంది.

Leave a Reply