బీజేపీతో తెగతెంపులు ఎందుకు చేసుకోరు..?

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అవలంభిస్తున్న వైఖరి పై వైఎసార్సీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు బీజేపీని విమర్శిస్తూ ముసలి కన్నీరు కారుస్తున్నారని జగన్ విమర్శించారు. బీజేపీని ఇంతగా విమర్శిస్తున్న చంద్రబాబు, కేంద్రం నుండి భయటకు వస్తానని, తన మంత్రులను వెనక్కి తీసుకుంటానని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నట్లు అనిపిస్తుందని జగన్ అన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కూడా జగన్ విమర్శించారు. 14 వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదాకు అడ్డు అని జైట్లీ చెబుతున్నారు అని, ప్రత్యేక హోదాకు 14 వ ఆర్ధిక సంఘానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అలాగే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెబుతూనే,ఇంతకు ముందు ఇచ్చిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతుందని జైట్లీ పొంతాన లేకుండా మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు.

Leave a Reply