వైకాపా నేతల సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయమై వైఎసార్సీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా బీజేపీ, టీడీపీ వ్యవహరించిన తీరుపై వైకాపా నేతలు మండిపడ్డారు. కేంద్ర మంత్రులు ఇష్టమొచ్చిన ప్రకటనలు చేశారని, దానికి టీడీపీ నేతలు వంత పాడారని విమర్శించారు.ప్రత్యేక హోదా కోసం జగన్ అలుపెరుగని పోరాటానికి సిద్ద పడ్డారు అని వైకాపా నేతలు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఐదు కోట్ల మందిని మోసం చేస్తున్న బీజేపీ ముద్దాయి అని, హోదా ఇవ్వని నరేంద్ర మోడీ కూడా ముద్దాయే అని వైకాపా నేతలు విమర్శించారు. అలాగే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకుండా పోరాటం చేస్తున్నట్లు చెప్పుకుంటున్న టీడీపీ, చంద్రబాబు కూడా దోషులేనని వైకాపా నేతలు అన్నారు. ముఖ్యమంత్రి గా ఉండేందుకు చంద్రబాబు కు అర్హత లేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ శవంగా మార్చిందని వైకాపా నేతలు విమర్శించారు.

Leave a Reply