చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి విజయవాడ పారిపోయాడు

గుడివాడ ఎమెల్యే కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మీడియాను బెదిరించి మీడియాలో సొంత డబ్బా కొట్టించుకుంటున్నారని, చంద్రబాబు అవినీతిని చిల్లర రాజకీయాలను ప్రశ్నించినందుకే సాక్షిని బ్యాన్ చేశారని విమర్శించారు. రాష్ట్రం మీ జాగిరా? మాకు నచ్చిన ఛానల్ చుడనివ్వరా? మీ బావ మరిది, తమ్ముడి కొడుకు సినిమాలే చూడాలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో సాక్షి ఛానల్ ను పునరుద్దరించాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తాము తలచుకుంటే రాష్ట్రంలో ఏ ఛానల్ కూడా నడవదు అని హెచ్చరించారు. బడుగు,బలహీన వర్గాల కోసం ఎన్టిఆర్ టిడిపిని స్థాపిస్తే, చంద్రబాబు, ఎన్టిఆర్ను బ్రతికుండగానే పార్టీ నుండి తరిమేశారని కోడాని నాని తెలిపారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు విజయవాడకు పారిపోయాడని ఎద్దేవా చేశారు.

Leave a Reply