వైఎస్ జగన్ కి కోలుకోలేని దెబ్బ

తెలంగాణలో అధికార తెరాసలోకి వలసలు జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపిలు  తెరాస దెబ్బకు కుదేలు అవుతున్నాయి. ఇప్పుడిక వైఎసార్సిపి వంతు వచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ముగ్గురు ఎమెల్యేలు, ఒక ఎంపి గెలిచారు. ఇప్పటికే ఆ పార్టీ తరపున గెలిచిన ముగ్గురు ఎమెల్యేలలో ఇద్దరు కారెక్కారు. ఇక మిగిలిన ఎమెల్యే, ఎంపిలను తెరాస తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. వీరిలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దిక్కుగా ఉన్న వైఎసార్సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ చేరికలను తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పాలేరుకు ఉపఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో పోటి ప్రధానంగా కాంగ్రెస్, తెరాస మధ్యనే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి వైఎసార్సిపి మద్దతు ప్రటించింది. ఇప్పుడు కనుక వైఎసార్సిపి ముఖ్య నేతలను గనుక తెరాసలోకి వస్తే అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అవుతుంది. అందుకే ఖమ్మం జిల్లాలో కీలక నేతలతో కేటిఆర్ చర్చిస్తున్నారు. ఈ నెల 4వ తేదిన పొంగులేటి తెరాసలోకి వస్తున్నట్లు సమాచారం.

Leave a Reply