పాలనలో ఫెయిల్ అయ్యారు..!

జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని, వైఎసార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ‘గడప గడపకు వైఎస్ఆర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని, ఎమ్మెల్యేలు,నాయకులు,కార్యకర్తలు,సమన్వయకర్తలు గడప గడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఇచ్చిన్ 600 హామీలను ప్రజలకు వివరిస్తూ, ఆయన చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. చంద్రబాబు రెండేళ్ళ పాలన ఎలా ఉంది? ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు? పాలనలో చంద్రబాబు పాస్ అయ్యారా, లేక ఫెయిల్ అయ్యారా? అంటూ 100 ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్ ప్రజలకు అందజేసి మార్కులు వేయాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు. దానికి ప్రజల్లో ఎక్కువ మంది చంద్రబాబుకు సున్నా మార్కులే ఇస్తున్నారు

Leave a Reply