ప్రత్యేక హోదా కోసం నిరసనలు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎసార్సీపీ నేతృత్వంలో బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు బంద్ ను విఫలయత్నం చేసేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో మాజీ మంత్రి ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత తమ్మినేని సీతారామ్ ఆత్మహత్యాయత్నం చేశారు. బంద్ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర తమ్మినేని  సీతారామ్ ఆద్వర్యంలో ధర్నా జరిగింది. దర్నా చేసినందుకు పోలీసులు సీతారామ్ ను, కార్యకర్తలను అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. కొంత సేపటికి ఆయనను విడిచిపెట్టారు. తమ్మినేని సితారామ్ ఇంటికి వెళ్లిపోగా, పోలీసు స్టేషన్ లో కంప్యూటర్ దగ్దం చేశారని , అందుకని అరెస్టు చేస్తున్నామని మళ్లీ పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో తనపై ఇలాంటి ఆరోపణ చేసినందుకు నిరసగా తమ్మినేని సీతారామ్ అక్కడ ఉన్న బాటిల్ లోని పెట్రోల్ ను తనపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.దాంతో అక్కడ ఉన్న కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు.పోలీసుల తీరు మరీ దారుణంగా ఉందని ఈ సందర్భంగా తమ్మినేని సీతారామ్ వ్యాఖ్యానించారు.

Leave a Reply