హరితహారంపై స్ఫూర్తినిస్తున్న ఫోటో …

హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు పాలుపంచుకుంటున్నారు. హరిత తెలంగాణ లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి తామున్నమంటూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకై పరితపిస్తున్నారు. హరిత హారంలో నాటిన ప్రతి ఒక్క మొక్క చెట్టుగా రూపాంతరం చెందేవరకు వాటిని బాధ్యతగా పెంచితే తప్పకుండా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న హరిత తెలంగాణ సాధ్యమవుతుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. రైతు కంట కన్నీరు ఆగిపోతుంది.ఖమ్మం జిల్లాలోని కొత్త గూడెం మండలంలోని చెంచుపల్లి తండాకలో హరిత హారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నఈ తాతయ్య ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో  సంచలనంగా మారింది. తనవంతుగా మొక్క నాటేందుకు నడిచొస్తున్న నాటి తరం యువకుడు నేటి తరం వృద్ధుడు రానున్న భవిష్యత్ కోసం వేస్తున్న అడుగులు అంటూ ఆయనకి కితాబిచ్చారు నెటిజేన్లు.

Leave a Reply