రామన్ పాడు కాలువను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు..

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో సంవత్సరాలుగా వెనుక బాటుకు గురి అయిన పాలమూరు జిల్లా ఇప్పుడు స్వరాష్ట్రంలో అభివృద్దికి నోచుకుంటుంది. స్వరాష్ట్రంలో తొలి ఫలితాన్ని జిల్లా ప్రజలు అందుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని భీమా ఎత్తిపోతల పథకం క్రింద ప్ర్రరంభించిన రామన్ పాడ్ ప్యారలల్ కెనాల్ ను తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. ఈ కాలువ ద్వారా జూరాల ప్రాజెక్ట్ నుండి నీటిని రామన్ పాడుకు నీటిని విడుదల చేశారు. గతంలో జూరాల నుండి రామన్ పాడుకు ఉన్న కాలువ కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వాడేవారు. ఇప్పుడు నిర్మించిన ప్యారలల్ కెనాల్ ద్వారా ఆత్మకూర్, కొత్తకోట మండల్లల్లోని 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, లక్ష్మా రెడ్డి, ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఎంపి జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రాం మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply