మరోసారి ఇరకాటంలో రాహుల్ గాంధీ..!

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, రాయ్ బరేలి పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ మరోసారి ఇరకాటంలో పడ్డారు. లోక్ సభలో పటేల్లకు రిజర్వేషన్ అంశం గురుంచి తీవ్రంగా చర్చ నడుస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ నిద్ర పోయారు. సహచర కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్నా పట్టించుకోకుండా పడుకున్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రాహుల్ గాంధీ ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా అనేక సార్లు ఇలాగే నిద్ర పోయారు. అప్పుడు కూడా ఇలాగే విమర్శలు వచ్చాయి. అయినా కూడా ఆయన మారలేదు. ఇప్పటికే నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ మరింత గాఢ నిద్రలోకి తీసుకెలుతున్నట్లే కనపడుతుంది.

 

Leave a Reply